9 June, 2026 | 2:28 AM

పారిశుద్ధ్య లోపంపై ప్రత్యేక దృష్టి సారించాలి

09-06-2026 01:41 AM

తాడ్వాయి, జూన్, 8( విజయ క్రాంతి): గ్రామాలలో పారిశుద్ధ్య లోపం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్చార్జి ఎంపీడీవో సవితారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు.ఈ గ్రామ సభకు ఆమె హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వర్షాకాలం ప్రారంభమవుతున్నందున గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం ఎక్కువ అవుతుందని, పారిశుధ్య లోపాన్ని నివారించడానికి గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ఎక్కడైనా తాగునీటి డిస్ట్రిబ్యూషన్ లైన్ లలో లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే లీకేజీలకు మరమ్మతులు చేయాలని కోరారు. మండలంలోని నందివాడ, పల్లెగడ్డ తండా, సంగోజి వాడి గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు సుమలత రామరాజు, సంకు పోచయ్య,జాదవ్ రేణుక గణపతి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.