31 July, 2026 | 1:09 AM

బదిలీపై వెళ్తున్న డీఎంకు సన్మానం

31-07-2026 12:00 AM

మేడిపల్లి, జులై 30 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ బదిలీపై సిద్దిపేట డిపోకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో చెంగిచెర్ల డిపో మేనేజర్ కి ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు.

గురువారం ఉప్పల్ డిపోలో బదిలీపైనా వెళ్ళిన డిఎం శ్రీనివాస్ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో చీఫ్ ఇన్స్పెక్టర్ రోహిణి, అసిస్టెంట్ ఇంజనీర్ వ్యాస్, డిపో సూపరిండెంట్ శ్రీనివాస్ రావు, శ్రీధర్, రహిమూన్, రాంగోపాల్, క్రిష్ణ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.