విద్యుత్ తీగలుపడి గొర్రెలు మృతి
నిర్మల్ ఆగస్ట్ 28 ( విజయక్రాంతి) నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ మండల్ కాల్వ గ్రామానికి చెందిన కురుమే నడిపి సాయన్న కుమారుడు దేవన్న కు అందాజ 160 నుండి 170 వరకు గొర్రెలు కలవు అయితే కురుమే దేవన్న రోజు లాగానే తన గొర్రెల మందను అందాజా 10 గంటల సమయంలో కాల్వ ఊరిలో నుండి వాటిని మేపడానికి తీసుకువెళ్లారు అయితే గొర్రెలు మేసే క్రమంలో నిర్మల్ కు చెందిన శనిగరపు భూమన్న తన తోట పక్కన విద్యుత్ తీగలు తెగిపడిపోవడంతో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ యొక్క విద్యుత్ తీగలకు నాలుగు గొర్రెలు రెండు మేకపోతులు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి
వీటి విలువ అందాజా ఒక్క లక్ష వరకు ఉంటుందని కురుమే దేవన్న తెలిపారు దేవన్న తన యొక్క గొర్రెలు రెండు మేకలు విద్యుత్ తీగలకు అంటుకోగానే విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ అధికారులు వచ్చి ఆ యొక్క తీగలను తొలగించి గొర్రెలను పంచినామా చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దేవన్నకి నష్టపరిహారం అందిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.






