22 August, 2026 | 6:43 PM

ఎస్సి సెల్ మండల అధ్యక్షునికి సన్మానం

22-08-2026 06:04 PM

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా  నూతనంగా నియమితులైన చీకోడ్ గ్రామానికి చెందిన కాంపల్లి శ్రీనివాస్ ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సంగితం శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కే కే మహేందర్ రెడ్డి,సిరిసిల్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పండుగు ప్రదీప్ లకు అలాగే  మండల సీనియర్ నాయకులకు ధన్యవాదాలు  తెలిపారు.ప్రభుత్వం ఎస్సిలకు అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విదంగా ముందుండి పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొప్పు రమేష్,నల్ల బుచ్చయ్య, తలారి నర్సింలు,గంత రాజు, బాలయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.