ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి
22-08-2026 06:23 PM
- ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ లక్ష్మీ
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ ఆర్ లక్ష్మీ డిమాండ్ చేశారు. శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, టాయిలెట్స్, మధ్యాహ్న బోజన వసతి సౌకర్యాలు, ప్రభుత్వ బాలుర హాస్టల్స్ లో వసతి కల్పన, టీచర్స్ కొరత పలు అంశాల పై విద్య వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్ లో ఉన్న పాఠశాలలో సందర్శించి సామాన్య ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.






