22 August, 2026 | 6:34 PM

కదిలి పాపేశ్వర ఆలయంలో శివనామ భజన

22-08-2026 06:02 PM

నిర్మల్ ఆగస్టు ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం శ్రీ శ్రీ కదిలి పాపేశ్వర అన్నపూర్ణ ఆలయంలో శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని శివనామ అఖండ భజన నిర్వహించారు. శనివారం రోజు జిల్లా నుండి కాకుండా నిజాంబాద్ అదిలాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివలింగానికి అభిషేకం నిర్వహించారు. మహారాష్ట్ర భజన మండలి ఆధ్వర్యంలో అఖండ శివ సంకీర్తన నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు పూజారులు పంచాక్షరి సిద్దు శంకర్ తదితరులు ఉన్నారు.