ఉత్తమ రక్తదాతకు సన్మానం
15-06-2026 12:00 AM
సామాజిక సేవ అందరి బాధ్యత మాజీ మంత్రి కేటీఆర్
రేగోడ్, జూన్ 14: ప్రపంచ రక్తదానదాతల దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ అందోల్ నియోజకవర్గం రేగోడ్ మండలం టీ.లింగంపల్లి గ్రామ యువత శాంరాయినోళ్ళ సంతో ష్ రావును ఉత్తమ రక్తదాతగా అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ సామాజిక సేవా అనేది మన అందరి బాధ్యతని, యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఇప్పటి వరకు 41 పర్యాయాలు ర క్తదానం చేసిన సంతోష్ రావు ను అభినందించారు. సంతోష్ రావు మాట్లాడుతూ రక్తదానం చేస్తూ తోటి యువతకు, ప్రజలకు ప్రోత్సహం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 6 వేల పైచిలుకు మందికి రక్తాన్ని అందించడం జరిగిందన్నారు.






