18 July, 2026 | 5:56 PM

Breaking News

వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి   •   గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి   •   ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చిలుక సతీష్   •  

జూన్ 21న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం

30-05-2026 12:32 AM

ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ పిడమర్తి రవి

మేడ్చల్ అర్బన్ మే 29(విజయక్రాంతి):తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని జూన్ 21న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా సన్నాహక సమావేశ గోడ పోస్టర్ ను మేడ్చల్లో విడుదల చేసినట్లు తెలిపారు.

ఉద్యమకారులకు 250 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.మేడ్చల్ లో జరిగిన సన్నాహక సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన గోడ పోస్టర్  విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసలా ఫిలిప్స్, మారేపల్లి సుధాకర్, గుండె కుమార్, రాజకుమార్, గుండె ఎల్లయ్య, నరసింహ, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.