18 July, 2026 | 6:15 PM

Breaking News

పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

30-05-2026 12:34 AM

జెడ్పీ సీఈవో పురుషోత్తం

మరిపెడ (మహబూబాబాద్) మే 29 (విజయక్రాంతి): మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని జెడ్పీ సీఈవో డీ. పురుషోత్తం అన్నారు. శుక్రవారం మరిపెడ మండలంలోని ఆనెపురం, ఎల్లంపేట, మరిపెడ మున్సిపాలిటీ 15వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీఓ బి. వేణుగోపాల్ రెడ్డితో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని, అందుకు అనుగుణంగా లబ్ధిదారులు కూడా తమ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.  ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ప్రత్యేక నమూనా ప్రకారం మూడు రంగుల పెయింటింగ్ తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ గోపి, ఉషా కీర్తి, పంచాయతీ కార్యదర్శులు మంజుల, సంబంధిత సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.