calender_icon.png 11 January, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ఐఏఎస్‌లకు మీడియా బలిపీఠం!

11-01-2026 01:19:31 AM

కొన్ని వేదికల్లో కించపరిచే వార్తలు

  1. వ్యక్తిత్వంపైనే దాడి.. మంత్రులతో సంబంధాలంటూ ప్రసారం 
  2. వ్యక్తిత్వ హననంతో అధికారులకు ఒత్తిడి 
  3. సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు
  4. ఆరోపణలను ఖండించిన మంత్రి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు
  5. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురి హితవు

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో వేడిపెరుగుతున్న కొద్దీ, మహిళా ఐఏఎస్ అధికారులు అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్న పరిస్థితి ఆందోళన కనిస్తున్నది. రాజకీయ క్రీడలో మహిళా ఐఏఎస్‌లు బలి పీఠమెక్కుతున్నారు. ముఖ్యంగా పలు అంశాల్లో మహిళా ఐఏఎస్‌లు వ్యక్తిత్వ హననానికి గురవుతున్నారు. ప్రభుత్వ విధానాలపై రాజకీయ విమర్శలు చేయాల్సిన చోట, కొందరు రాజకీయ శక్తులు, మీడియా వర్గాలు మహిళా ఐఏఎస్ అధికారులను ముందుకునెట్టుతూ విమర్శలు గుప్పించడం వివాదాస్పదంగా మారింది.

కొన్ని మీడియా వేదికల్లో.. తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి, వారికి మంత్రులతో సంబంధాలున్నాయంటూ ప్రచారం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. పాలనా నిర్ణయాలు, అధికారిక బాధ్యతలను పక్కనపెట్టి, మహిళా అధికారుల నిర్ణయాలను మంత్రులతో వ్యక్తిగత సన్నిహిత సంబంధాలకు కట్టబెట్టే ప్రయత్నాలు.. వారి వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజా అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.

ఒక మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారినికి మధ్య సంబంధాన్ని అంటగట్టడం, మరొక మంత్రికి అధికారులను వేధిస్తున్నారనే వార్తలు.. ఆయా మీడియాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీనిలో వాస్తవాలపై చర్చించడం కంటే ఆయా అధికారుణుల వ్యక్తిత్వానికి సంబంధించిన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుత ఈ పరిస్థితి.. మహిళా అధికారుల పట్ల కించపరిచే ధోరణి స్పష్టమవుతున్నది. శాసన నిర్ణయాలను అమలుపరిచే పరిపాలనా అధిపతుల స్థాయిలో ఉండే అధికారులపై ఈ రకమైన ఆరోపణలు, వార్తలపై తీవ్రమైన ఆగ్రహం వెల్లువెత్తున్నది.

ఈ ధోరణి సమాజ పోకడలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఒక్క మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు. తప్పుడు వార్తలు ప్రసారంచేసి మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. మీడియా హద్దులు దాటిందని.. ఇది జర్నలిజం కాదని, వ్యక్తిత్వ హననమే అని ఆగ్రహం వ్యక్తంచేసింది. 

అధికారులకు ఒత్తిడి.. 

మహిళా ఐఏఎస్‌లు తీసుకునే కీలక పరిపాలనా నిర్ణయాలను మంత్రులతో వ్యక్తిగత సంబంధాలకే కట్టబెట్టే విధంగా కథనాలు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణలో మ హిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగాచేసుకుని సాగుతున్న వ్యక్తిత్వ హననం తరహా ప్రచారాలు తీవ్ర ఆందోళన వెలువడుతుంది. ఇటీవల కొన్ని శాఖల్లో తీసుకున్న నిర్ణయాలపై కథనాలు రాస్తూ ‘ఫలానా మంత్రి సన్నిహితురాలు’, ‘మంత్రితో ప్రత్యేక సంబంధాల వల్లే పోస్టింగ్’, ‘మంత్రి అం డతోనే ఈ స్థాయి అధికారాలు’ అంటూ మహి ళా ఐఏఎస్‌లపై ఆరోపణల తరహాలో కథనాలు వెలువడుతున్నాయి.

పరిపాలనా ఫైళ్లలోని నిబంధనలు, చట్టపరమైన అధికారం, సమిష్టి నిర్ణయ ప్రక్రియను పక్కనపెట్టి, ఒక మహిళా అధికారి విజయాన్ని లేదా నిర్ణయాన్ని వ్యక్తిగత సంబంధాలకు ఆపాదించడం సరికాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మంత్రులతో సంబంధా లు ఉన్నాయంటూ పరోక్షంగా ప్రచారం చేయ డం ద్వారా మహిళా అధికారుల ప్రతిష్ఠను దెబ్బతింటుంది.

వారి వృత్తిపరమైన నిబద్ధతపై అను మానాలు కలిగించడం, పాలనా వ్యవస్థపై ప్రజ ల్లో అపోహలు పెంచడం వంటి పరిణామాలకు దారి తీస్తోందని సివిల్ సర్వీస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా కథనాలు ఫీల్డ్‌లో నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని తగ్గించడం, మానసిక ఒత్తిడి పెరగడం, ప్రతి నిర్ణయా నికి రాజకీయ రంగు పులుమడం భయం కలిగించే పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇది వ్యక్తిగ తంగా ఒక అధికారిని మాత్రమే కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థను ప్రభావితం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

బాధ్యతాయుత జర్నలిజం అవసరం.. 

ప్రభుత్వ విధానాలపై గట్టిగా ప్రశ్నించాల్సిన మీడియా, ఇప్పుడు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిగత గౌరవాన్ని లక్ష్యంగా చేసుకునే కథనాలు వండటం  స్థాయికి దిగజారుతోందన్న విమర్శలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక వృత్తి వైఫల్యం మాత్రమే కాదని, వ్యవస్థకే ప్రమాదమని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీడియా విమర్శకు, విష ప్రచారానికి మధ్య గీతను దాటిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిపాలనా నిర్ణయాలను విమ ర్శించడం మీడియా బాధ్యత.

కానీ ఆ నిర్ణయాలను మంత్రులతో సంబంధాలుగా, వ్యక్తిగత సన్నిహితత్వంగా, నైతిక అనుమానాలుగా మలచడం జర్నలిజం కాదని, -క్యారెక్టర్ అసాసినేషన్ అని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆధారాలతో మాట్లాడటం, విధానాలపై ఫోకస్ పెట్టడం, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటం, లింగ వివక్షకు తావు లేకుండా రాయటమే బాధ్యతాయుత జర్నలిజం అవుతుందని హితవు పలుకుతున్నారు.

మహిళా ఐఏఎస్ అధికారులను కించపర్చడం కేవలం వ్యక్తిపై మాత్రమే దాడి కాదు.. అది పరిపాలనా వ్యవస్థపై, మహిళల సాధికారతపై, ప్రజాస్వామ్యంపైనే దాడి అని గమనించా ల్సిన అవసరం ఉంది. మీడియా ప్రసారం చేసే వార్తలను పునఃపరిశీలించాలి. ఎందుకంటే బాధ్యత లేని జర్నలి జం రాజకీయాలకు ఆయుధం కావడంతోపా టు ప్రజలకు, సమాజానికి నష్టం చేస్తుంది. 

రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా..

ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన సందర్భాల్లో నేరుగా విధానాలపై ప్ర శ్నించకుండా, మహిళ ఐఏఎస్‌లను ముందుకు నెడుతూ మంత్రులతో సం బంధాలున్నాయంటూ కథనాలు రా యడం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులనే రాజకీయ పోరా టంలో బలిచేయడం ప్రజాస్వామ్యానికి మేలుకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ధోరణి అధికారుల స్వతంత్రత ను కూల్చుతుందని, నిర్ణయాత్మక పాలనను స్థంభింపజేస్తుందని, రేపటి మహిళా అధికారులకు భయాన్ని కలిగిస్తుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. విధానాలను విమర్శించడం, తప్పులను ప్రశ్నించవచ్చని కానీ రాజ కీయ ప్రయోజనాల కోసం ఆధారాల్లేని ఆరోపణలు, వ్యక్తిగత సంబంధాల ఊహాగానాలు, మహిళా అధికారుల గౌరవంపై దాడులు చేయడం, పాలనా వ్యవస్థపై దాడి గా అభివర్ణిస్తున్నారు. ఒక అధికారినికి అవమానం జరిగితే మొత్తం పాలన వ్యవ స్థకే తలవంపులు వస్తాయి.