11-01-2026 01:17:49 AM
మూడేండ్లకు రూ.8,532 కోట్ల భారం
ఈఆర్‌సీలో పిటిషన్ దాఖలుచేసిన డిస్కంలు
అభ్యంతరాలుంటే ఈ నెల 31లోగా తెలపాలన్న ఈఆర్‌సీ
ఫిబ్రవరి 27న ఈఆర్‌సీ భవన్‌లో బహిరంగ విచారణ
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): రాబోయే సంవత్సరానికి (2026 27) సంబంధించి ఎలాంటి ఛార్జీల భారాన్ని మోపని డిస్కంలు పాతకాలం నాటి ట్రూ అప్ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపేందుకు రంగం సిద్ధంచేశాయి. 2022 23, 2023 2024 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించి ఉత్తర మండల విద్యుత్తు పంపి ణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్)లు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ముందు ఇందుకు సంబంధించిన పిటిషన్లన సమర్పించాయి. ఈ మూడేళ్లకు సంబంధించి మొత్తం రూ.8,532 కోట్లను వినియోగదారులపై భారం పడనుంది. విద్యుత్ కొనుగోలు అంచనాలకు, కొనుగోలు చేసినదానికి మధ్య తేడానే ట్రూఅప్ ఛార్జీలుగా చెప్పవచ్చు. 2022 ఎస్పీడీసీ ఎల్ రూ.4,104కోట్లు, ఎన్‌పీడీసీఎల్ రూ. 2,779 కోట్లను ట్రూఅప్ ఛార్జీలుగా ప్రతిపాదించాయి.
అలాగే 2023 ఆర్థిక సంవ త్సరంలో ఈ రెండు డిస్కంలు కలిసి రూ. 2,448 కోట్లుగా ట్రూఅప్ ఛార్జీలను ప్రతిపాదించాయి. అంటే ఈ రెండు సంవత్సరాల్లో ట్రూఅప్ చార్జీలుగా రూ.9,331 కోట్లకు డిస్కంలు ప్రతిపాదించాయి. అయితే 2024 కొనుగోలు అంచనాలకంటే కొనుగోలు చేసిన విద్యుత్తు ఖర్చు తక్కువగా ఉండటంతో రెండు డిస్కంల పరిధిలో రూ.799 కోట్లు తక్కువగా తేలింది. మొత్తం మూడు ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.8,532 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపేందుకు అనుమతించాలని ప్రతిపాదిస్తూ డిస్కంలు చేసుకున్న విజ్ఞప్తిపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ చేయనుంది. దీనిపై ఏమైనా అభ్యంత రాలుంటే ప్రజలు, సంస్థలు, ఎన్‌జీవోలు, నిపుణులు ఈనెల 31లోగా తెలపవ చ్చు. ఈ రెండు డిస్కంల పిటిషన్లపై ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని ఈఆర్‌సీ భవన్‌లో బహిరంగ విచారణ జరుపుతుంది.