16-02-2026 12:38:55 AM
కోచ్ కర్ణం గణేష్ రవికుమార్, మల్లేశ్వరి
చేగుంట ఫిబ్రవరి 15, సికింద్రాబాద్లోని జింఖాన గ్రౌండ్ లో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలలో మెదక్ జిల్లా నుండి 8 మంది క్రీడాకారిణిలు సౌత్ జోన్ పోటీలకు ఎంపికయ్యారని మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కరణం గణేష్ రవికుమా ర్,మల్లీశ్వరి చేగుంట పట్టణ కేంద్రంలో ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారిణిలు సబ్ జూనియర్ విభాగంలో మూడవత్ కల్పన, తేజవత్ ఇందిరా, అజ్మీరాప్రణవి, పనుగోత్ శ్రీలక్ష్మి,జూనియర్ విభాగంలో సగ్గిడి నవ్యశ్రీ, సీనియర్ విభాగంలో బల్పటి అనిత, తారవత్ నిఖిత ఎంపికయ్యారని, ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 21,22 తేదీలలో తమిళనాడు రాష్ట్రం ,చెన్నైలోనీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే సౌత్ జోన్ పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా టీం కోచ్ లు గా మహేష్,రంగీలా, కావేరి వ్యవహరించారని తెలిపారు,వీరి ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.