30 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఐరన్ మాత్రలు వికటించడమే కారణం
వికారాబాద్, జూన్ 27( విజయక్రాంతి): పరిగి మండలం నస్కల్ గ్రామంలోని కేజీబీవీ వసతిగృహంలో 30 మంది విద్యార్థి నిలు గురువారం రాత్రి అస్వస్థతకు గుర య్యారు. వసతి గృహంలో గురువారం మద్యాహ్నం విద్యార్థినిలకు ఐరన్ అండ్ పోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేశారు. మాత్రలు వేసుకున్న మూడు నాలుగు గంటల తర్వాత కొంతమంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు కాగా.. మరికొందరు కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో సిబ్బంది వెంటనే విద్యార్థినిలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు తెలుసుకు నేందుకు వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కొందరు విద్యార్థినులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆక్సిజన్ పెట్టి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.




