calender_icon.png 5 July, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోశయ్య నేటి సమాజానికి ఆదర్శప్రాయుడు

05-07-2025 12:00:00 AM

 జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జూలై 4 ( విజయక్రాంతి ) : రోశయ్య నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం జిల్లా టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో నిర్వహించిన రోశయ్య 93వ జయంతి కార్యక్రమంలో  రోశయ్య చిత్రపటానికి జిల్లా కలె క్టర్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అ ర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనా డు రాష్ట్రాల గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి తనవంతు సహకారం అందించారని కొనియాడారు. జి ల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, పి z.డి.డిఆర్డీఒ ఉమాదేవి, ఇతర జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.