11 May, 2026 | 2:20 AM

రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించాలి

11-05-2026 01:01 AM

అఖిలభారత రైతు కూలీ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

గరిడేపల్లి మే 10 :  రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించాలని లేకుంటే నిరంతరం పోరాటాలు తప్పవని అఖిలభారత రైతు సంఘం డివిజన్ అధ్యక్షుడు మేకల కనకారావు అన్నారు. మండలంలోని వెలిదండ గ్రామంలో అఖిలభారత రైతుకూలీ సంఘం గ్రామ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం మరియు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు కూలీ సంఘం అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులకు ఎరువుల విత్తనాల సబ్సిడీపై సకాలంలో అందించాలని, పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్నారు.

అనంతరం అఖిలభారత రైతు సంఘం గ్రామ నూతన కార్యవర్గాన్నీ ఎన్నుకున్నారు. దీనిలో అధ్యక్షునిగా చనగాని పెద్ద సాంబయ్య, కార్యదర్శిగా చింతమల్ల అంజయ్య, సభ్యులుగా గుండు మల్లయ్య, వల్లపు దాసు లచ్చయ్య, చనగాని పర్వతాలు, అలవాల శ్రీను, గుండు సైదులు, చామకూరి వెంకటయ్య, కారింగుల బ్రహ్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మా శెట్టి అంజయ్య, కామల్ల శ్రీను, చనగాని నారాయణ, లక్ష్మయ్య గుండు నగేష్, పోటు శ్రీహరి, తాళ్లూరి సూర్యం, పోటు మంగమ్మ, వీసాల బ్రహ్మయ్య పాల్గొన్నారు.