17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సకాలంలో రైతులకు ఎరువులు

19-12-2025 12:00 AM

ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,డిసెంబర్18(విజయక్రాంతి):రైతులకు సకాలంలో ఎరువులు అందుటకు ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు అందుబాటులోకి రావడం జరిగిందని ఈ యాప్ ద్వారా పట్టా, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా ఉన్న రైతులు, కౌలు రైతులు, పట్టా లేని రైతులు కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

బుకింగ్ చేసుకునే సమయంలో రైతులు తమ పట్టా పాస్ బుక్ నెంబర్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా నెంబర్, పట్టా లేని రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు వారి ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు.యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులు ఆర్డర్ కన్ఫర్మేషన్ అవ్వగానే సమీప ఫెర్టిలైజర్ దుకాణం అలోకేషన్ అవుతుందని రైతులు వెంటనే మరుసటి రోజు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా ఎరువులు తీసుకోవచ్చని తెలిపారు.

సాగు చేసే ఎకరాల ఆధారంగా పలు విడుదలలో యూరియా బస్తాలను రైతులు తీసుకోవాలని ,ఎకరం విస్తీర్ణం సాగు చేసే రైతు ఒకే వాయిదాలో, ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు రెండు వాయిదాలలో, ఐదు నుంచి 20 ఎకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు నాలుగు వాయిదాలలో ఎరువు బస్తాలను తీసుకోవచ్చని, ఒక విడత ఎరువులు తీసుకున్న తర్వాత, తదుపరి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా 15 రోజుల వ్యవధి ఉండాలన్నారు.

ఈ మొబైల్ అప్లికేషన్ పై స్థానికంగా ఉండే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏఈఓలకు అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగిందని సహకార సంఘాలకు, డీఎస్డిఎస్ సభ్యులు అండ్ ఆల్ ఫెర్టిలైజర్ షాప్ కీపర్స్ కి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఆయన పేర్కొన్నారు.ఇతర సమాచారం కోసం రైతులు సమీప మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.