calender_icon.png 21 December, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం

19-12-2025 12:00:00 AM

కొండపాక, డిసెంబర్ 18: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మ ల్లికార్జున స్వామి క్షేత్రంలో మార్గశిర మాస శివరాత్రిని పురస్కరించుకుని గురువారం సంతాన మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ నిర్వహించి లఘున్యస పూర్వక రుద్రాభిషేకం విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి అన్నపూజ చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.