15-01-2026 12:38:50 AM
ఇంటింటా ముగ్గుల పందిరిలు
హన్వాడ, జనవరి 14: సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా పండుగలు నిలుస్తాయని పెద్దదర్పల్లి గ్రామ సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్ అన్నారు. మండల పరిధిలోని పెద్దదర్పల్లి గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించడంతోపాటు భోగిమంటలను, సంక్రాంతి సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందించారు. ఇంటింటా ముగ్గులు పందిరిలా వేసి పండుగ వాతావరణం ఔన్నత్యాన్ని తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.
ముగ్గులు సృజనాత్మకతను వెలికి తీస్తాయి
చిన్నచింతకుంట జనవరి 14 : సంక్రాంతి సందర్భంగా సంతూర్ వెంకటేశ్వర ఏజెన్సీ రాజేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సంతూర్ ఏజెన్సీ భవన ఆవరణలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలను సర్పంచ్ మానస దశరథ ప్రారంభించారు. పంచాయతీ పరిధిలో 100 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తరచూ ముగ్గులు వేసే మహిళల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుందన్నారు.ఇందులో మొదటి బహుమతి పల్లవి, రెండవ బహుమతి మమత,మూడవ బహుమతి పద్మ, మరో 10 మందికి కన్సలేషన్ బహుమతులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస దశరథ్,ఉపసర్పంచ్ భూలక్ష్మి చంద్రశేఖర్, వెంకటేశ్వర ఏజెన్సీ రాజేందర్, జేఎస్‌ఓ శ్రీనివాసులు, కాంతయ్య శంకర్ విజయ్ శివకుమార్ రాఘవేందర్ ప్రజలు పాల్గొన్నారు.
ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతుల ప్రధానం
వెల్దండ, జనవరి 14: వెల్దండ మండలంలో బుధవారం రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ జన్మ దినోత్సవాన్ని బారాసా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని 32 గ్రామపంచాయతీలలో వెంకటేష్ జన్మదినోత్సవాలు పురస్కరించుకొని మహిళలకు యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఆయన పేరుతో ఉన్న కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు.