15-01-2026 12:39:03 AM
బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నేతల ఫైర్
రామాయంపేట, జనవరి 14 :రామాయంపేట మున్సిపాలిటీలో కోట్లలో అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. అక్రమాలపై ప్రతిపక్షం తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. బుధవారం టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు నేతృత్వంలో పార్టీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని ఇష్టారాజ్యంగా విమర్శించడం సరైనది కాదన్నారు. ఏదైనా అవినీతి జరిగినట్లు రుజువు చూపితే సదరు కమిషనర్ పై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అంతేగానీ అనవసరపు ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతలకు తగదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సరాఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, చింతల స్వామి,దేమే యాదగిరి,దేవుని రాజు, పోచమ్మల అశ్విని లు ఉన్నారు.