15-01-2026 12:37:25 AM
అయిజ, జనవరి 14: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదాసి కురువ - మదారి కురువ సంక్షేమ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశామని గద్వాల జిల్లా మాదాసి కురువ సంఘం అధ్యక్షులు పుల్లూరు వెంకటేష్ అన్నారు. ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ మాదాసి కురువ - మదారి కురువల ఐక్యతకు నిదర్శనమని భవిష్యత్తులో మాదాసి కురువ మాదారి కురువలకు ఏ సమస్య వచ్చినా సంఘటితంగా పోరాడి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని వెంకటేష్ అన్నారు. ఈకార్యక్రమంలో తిక్కయ్య, మధు,రవి ప్రకాష్, మల్లికార్జున మొదలగు వారు పాల్గొన్నారు.