మతసామరస్యానికి ప్రతీక పండుగలు
- 40వ డివిజన్ కార్పొరేటర్ సీబీశ్రీపూజిత
సొంత ఖర్చులతో నిరుపేదలకు ముస్లింలకు రంజాన్ ప్యాకేజీల పంపిణీ
మహబూబ్ నగర్ టౌన్, మార్చి 19 : నిరుపేదలకు అన్ని విదాలుగా అండగా ఉంటామని 40వ డివిజన్ కార్పొరేటర్ సీబీ శ్రీపూజిత అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ సీబీ శ్రీపూజిత తన సొంత ఖర్చులతో డివిజన్ లోని నిరుపేదల ముస్లింలకు గురువారం రంజాన్ ప్యాకేజీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవ పరమావదిగా రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
కులమతాలకతీతంగా డివిజన్ లోని ప్రజలకు తనవంతు సహాయం అందజేస్తానని తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకలుగా పందుగలు ని లుస్తాయని అన్నారు. రంజాన్ మాసంలో నిరుపేద ముస్లింలకు తనవంతు రంజాన్ ప్యాకేజీలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో డివిజన్ ను అన్ని విధాలంగా అభివృద్ధి చేసి ఆదర్శ డివిజన్ తీర్చిదిద్దుతామని అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సేలా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. సొంత ఖర్చులతో రంజాన్ ప్యాకేజీలు పంపిణీ చేసిన కార్పొరేటర్ సీబీ శ్రీపూజితను డివిజన్ ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, సన్నీ రాజ్, తేజ, సోనీ తదితరులు పాల్గొన్నారు.




