51 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం
హైకోర్టు తీర్పుతో విలీనానికి మార్గం సుగమం
హైదరాబాద్, డిసెంబర్ 07 (విజయ క్రాంతి): రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో ఉత్తర్వులు జారీచేసింది. గ్రామ పంచాయ తీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటి షన్లను ఈ నెల౬న హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది.
ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదంతో గెజిట్ జారీఅయ్యింది. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న, అదేవిధంగా బయ టవైపు ఆనుకుని ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీల విలీనానికి మంత్రివర్గ ఉపసం ఘం సిఫారసు చేసింది. గ్రామ పంచాయ తీల విలీనంతో ఓఆర్‌ఆర్ పరిధి మొత్తం పట్ట ణ ప్రాంతంగా మారనున్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపా లిటీల్లో విలీనం చేయగా, అత్యధికంగా మేడ్చ ల్‌వ్‌మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను రెండు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.




