డబ్బులతో ఉడాయించిన మేనేజర్..!
* నాగర్‌కర్నూల్ మాంగళ్య షాపింగ్ మాల్‌లో ఘటన
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): మాంగళ్య షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న మేనేజర్ డబ్బులతో ఉడాయించినట ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకోగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్సై చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ప్రాంతానికి చెందిన సాయికృష్ణ నాగరకర్నూల్ జిల్లా కేంద్రంలోని మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం నుంచి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా దుస్తులు అమ్మగా వచ్చిన డబ్బులను యాజమాన్యానికి చెందిన ఖాతాలో జమచేయాల్సి ఉండగా గత కొద్దిరోజులుగా జమ చేయడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో సుమా రు రూ.6.90 లక్షలతో ఉడాయించినట్లు యాజమాన్యం గుర్తించింది. నూతన మేనేజ ర్ గౌరీశంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.




