21 August, 2026 | 9:55 PM

Breaking News

సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •  

రైతు సంక్షేమానికి కృషి

08-12-2024 02:20 AM

ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్

నిర్మల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవతి అనిల్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా మామాడ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. రైతు వేదిక వద్ద జరగిన కార్యక్రమాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు మహలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం, రైతులకు బోనస్ ఇస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పాలనలోనే ప్రజాప్రతినిధులు దాచుకోవడం, దోచుకోవడమే జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహారిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, ఆది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.