23 April, 2026 | 6:58 PM

నటుడు మోహన్‌బాబు ఇంట్లో గొడవలు

09-12-2024 01:16 AM
  1. తండ్రిపై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ కుమార్
  2. బంజారాహిల్స్ ఎక్స్ వైద్యశాలలో మంచు మనోజ్‌కు చికిత్స

మహేశ్వరం, డిసెంబర్ 8: సినీనటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటూ ఆదివారం ఉదయం నుంచి మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మా రింది. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో మోహన్‌బాబుకు ఇల్లు ఉంది. ఈ ఇంటి నుంచి ఆదివారం ఉదయం మోహన్‌బాబు కొడు కు మంచు మనోజ్ డయల్ 100కు ఫోన్ చేసి తన తండ్రి మోహన్‌బాబు తనతో పాటు తన భార్యపై దాడి చేసి గాయపరిచినట్లు సమాచారమిచ్చారు.

దీంతో పహాడీ షరీఫ్ ఎస్‌ఐ శ్రీనివాస్ వెళ్లి విచారించగా.. మా మధ్య జరిగిన గొడవలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, కూర్చుండి పరిష్కరించుకుం టామని చెప్పడంతో వెనుదిరిగారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డిని వివరణ కోరగా కేవలం 100 డయల్‌కు ఫోన్ వచ్చిందని, దాని ఆధారంగానే విచారణకు వెళ్లిన పోలీసులకు.. కుటుంబ గొడవలను మోహన్‌బాబు కుటుంబ సభ్యులు చెప్పారని వివరణ ఇచ్చారు.

ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. మంచు ఫ్యామిలీలో తరుచూ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భూ వ్యవహారాలతో పాటు ఆస్తులు, విద్యాలయాల వ్యవహారంలో ఒక్కరిపై ఒక్కరూ దాడి చేసుకొనే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో నూ మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మనోజ్‌కు వైద్య పరీక్షలు..

మంచు మనోజ్ ఆదివారం సాయంత్రం తన భార్యతో కలిసి బంజారాహిల్స్‌లోని టీఎక్స్ వైద్యశాలకు వచ్చారు. భార్య సహాయంతో కుంటుతూ వైద్యశాలలోకి వెళ్లారు. సిటీ స్కానింగ్ నిర్వహించిన వైద్యులు మనోజ్ కాలితో పాటు కడుపులోనూ గాయమైనట్లు గుర్తించారు. కుడి కాలు కండరాల నొప్పితో వాపు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మెడ భాగంలోనూ స్వల్ప గాయా లైనట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు వైద్యమందించిన డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.