15 March, 2026 | 10:13 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సంచలనం రేపిన ఫైల్స్ ట్యాంపరింగ్

17-03-2025 02:04 AM

 కేసులో ఏడుగురికి 14 రోజుల రిమాండ్

 మరో 21 మందిని గుర్తించినట్లుగా సమాచారం

మోతె,మార్చి16:-  మోతె మండలములోని రెవెన్యూ ఆఫీసులో ఫైల్స్ ట్యాంపరింగ్ వ్యవహారం లో సంచలనం రేపిన కేసు ఓ కొలిక్కి వచ్చింది. మార్చి 4 న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,ఆర్డీవోతో కలిసి మోతె తహసిల్దార్ ఆఫీసును ఆకస్మిక చేసిన తనిఖీలలో బయటికి వచ్చిన పహానిలా ట్యాంపరింగ్లో  11 నకిలీ ఫైల్స్ ను గుర్తించారు.

  ఇన్ని రోజులు ఉత్కంఠ గా సాగిన ఈ కేసులో పూర్తి ఆధారాలతో ఏడుగురు నిందితులను ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వీరికి జిల్లా జడ్జ్ 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో సస్పెండ్ అయిన తహసిల్దార్ సంఘమిత్ర ,మహిళా ఆర్‌ఐ నిర్మలాదేవిని నల్గొండ సబ్ జైలుకు తరలించారు. మీసేవ నిర్వాహకుడితో సహా మిగతా ఐదుగురిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో వీరితోపాటు మరో 21 మందిని గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు గా సమాచారం.