అమ్ములపొది నింపడమే లక్ష్యమైంది!
ఐ.ప్రసాదరావు :
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు తమ బడ్జెట్‌లో రక్షణతో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చేవి. కానీ, గడిచిన నాలుగేళ్లు గా రష్యా- -ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఉగ్రవాదం, పొరుగు దేశాల సరిహద్దు వివాదాలు ప్రతి దేశాన్ని భద్రత వైపు మళ్లిస్తున్నాయి. భద్రత కోసం ఆర్థిక వ్యవస్థ లు బలంగా ఉన్న దేశాలన్నీ వార్షిక బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించడం అనివార్యంగా మారింది.
అందుకు అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణి కూడా మరో కారణం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా జర్మనీ రక్షణ కోసం సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు ఖ ర్చు చేయడానికి సిద్ధపడింది. ఇది దాదాపు మన దేశ ఒక సంవత్సర బడ్జెట్‌తో సమానం కావడం గమనార్హం. భూభాగంలో చిన్నదైన జర్మనీ రక్షణ రంగానికి అంత డబ్బు కేటాయించడం అంతర్జాతీయంగా చర్చనీయాం శమైంది. ప్రపంచ దేశాలు రక్షణ కోసం చేస్తున్న ఖర్చులో సగానికి పైగా వాటా కేవ లం అమెరికా, చైనా, రష్యాలదే.
ఈ మూడు కలిపి మొత్తం రక్షణ వ్యయంలో 54 శాతం ఖర్చు చేస్తున్నాయి. ఒక్క అమెరికా తన జీడీపీలో 3.4 శాతం అంటే సుమారు 997 బిలి యన్ డాలర్లను రక్షణ రంగానికే వెచ్చిస్తోం ది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా 314 బిలియ న్లు, రష్యా 149 బిలియన్లు, జర్మనీ 88.5 బిలియన్లు ఖర్చు చేస్తున్నాయి. మన దేశం కూడా 2026--27 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ కోసం 7,84,678 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశ భద్రత కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
దౌత్య సంబంధాలు మెరుగుపర చుకోవడంలో విఫలం కావడం వల్లే ఈ స్థాయిలో ఆయుధాల పోటీ పెరుగుతోంది. అహంకారం, ఆధిపత్య పోరు రక్షణ బడ్జెట్‌లను పెంచుతున్నాయి. ఆధునిక కాలంలో భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రతి దేశా న్ని కఠిన నిర్ణయాల వైపు నడిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సైనిక నియామకాలు, అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, క్షిపణులు, రాడా ర్లు, ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు.
రక్షణ సామాగ్రి కొనుగోలుకు మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ వం టి దేశాలు ఆయుధాల అమ్మకం ద్వారా లాభాలు ఆర్జిస్తూ తమ జీడీపీని పెంచుకుంటున్నాయి. సామ్రాజ్యవాద దేశాలు ఉద్రిక్త తలు పెరగడమే తమకు లాభమని భావిస్తున్నాయి. దీనివల్ల మిగిలిన దేశాలు సంక్షేమం కంటే సమరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా కునారిల్లుతున్నాయి. సంక్షేమమా లేక యుద్ధమా అనే ప్రశ్న ఇప్పుడు పాలకుల ముందు నిలిచింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు
మన దేశానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పెద్ద సమస్యగా మారింది. ఆయుధ ఎగుమతులే ఆదాయ వనరుగా ఉన్న కొన్ని దేశాలు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలు ఉండేలా చూస్తున్నాయి.మత, భాషా, జాతి వివక్షతలు కూడా అశాంతికి కారణమవుతున్నాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ యుద్ధం వల్ల గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడి వంట గదిపై ప్రభావం పడుతోంది.
ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణం తర్వాత దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఉద్రిక్తతలు చమురు సరఫరా ను దెబ్బతీస్తూ ప్రపంచ దేశాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై చేస్తు న్న యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఎరువులు, చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
మన దేశంలో పర్యాటకం, పరిశ్రమలు ఈ ప్రభావానికి గురవుతున్నాయి. ఇరాన్ తన సుప్రీం నేత మరణానికి ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. చమురు, గ్యాస్ రిఫైనరీలపై దాడులు చేస్తూ ఇరాన్ ప్రపంచ దేశాల అవసరాలను దెబ్బతీస్తోంది. తాజాగా అమెరికా ఇరాన్‌పై భూత ల దాడులకు సిద్ధమవుతోంది.ఇరాన్ కూడా హౌతీలు, హిజ్బుల్లా వంటి రక్షక దళాలను రంగంలోకి దించింది. ఈ యుద్ధం భవిష్యత్తులో ఎంతటి నష్టాన్ని మిగులుస్తుందోనని మానవాళి ఆందోళన చెందుతోంది.
సరిహద్దు వివాదాలు
ప్రపంచంలో ఎక్కడ చూసినా వివాదాలే కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కొరియా మధ్య ఘర్షణలు, తైవాన్ విషయంలో చైనా తీరు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రీన్ లాండ్ విషయంలో అమెరికా వైఖరి, భారత్ - చైనా సరిహద్దు తగాదాలు శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని అంతర్గత సంక్షో భం, అఫ్గానిస్థాన్‌తో వివాదాలు ప్రాంతీయ భద్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ అలజడుల నుంచి తట్టుకోవడానికి ప్రతి దేశం ఆహారం కంటే ఆయుధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రజల ఆకలి తీర్చడం కంటే శత్రువును ఎదుర్కోవడమే పాలకుల ప్రథమ కర్తవ్యంగా మారుతోంది. ఇది మానవాళి మనుగడకు చేటు తెచ్చే పరిణామం. అంతిమంగా దీనివల్ల ఎవరికి లాభం కలుగు తుందో పాలకులు ఆలోచించాలి. అమెరికా తన ఏకధృవ ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు చైనా ప్రాబల్యం పెరగడం అమెరికాకు మింగుడుపడటం లేదు. ఐక్యరాజ్యసమితి ఉత్సవ విగ్ర హంగా మారడం వల్ల దేశాలు శాంతి మా ర్గాన్ని వీడి ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి.
డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయడా నికి రష్యా, భారత్, చైనా వంటి దేశాలు తమ సొంత కరెన్సీలలో వాణిజ్యం చేస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీని తీసుకురావాలని భావించడం అమెరికాకు ఆగ్రహం కలిగి స్తోంది. దీనివల్ల ట్రేడ్ వార్ మొదలైంది. ప్రతీకార సుంకాలు విధిస్తూ ఒకరిపై ఒకరు ఆర్థిక దాడులకు దిగుతున్నారు. డాలర్ స్థాన్ని కాపాడుకోవడానికి అమెరికా యుద్ధాలను ప్రేరేపిస్తోంది.
నైతికత లోపించిన సామ్రాజ్యవాదం
అమెరికా వంటి దేశాలు ఇతర దేశాల చమురు నిల్వలు, ప్రకృతి వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వెనిజులా, క్యూబా వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరికాదు. ప్రపంచ దేశాల్లో వలస వ్యతిరేక ఉద్యమాలు, నియంతృత్వ పోకడలు, కార్పొరేటీకరణ పెరిగిపోయాయి. మైనింగ్ మాఫి యా ప్రకృతి వనరులను దోచుకుంటోంది.
ఒక దేశ అంతర్గత విషయాల్లో మరో దేశం తలదూర్చడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీనివల్ల సంక్షేమ పథకాలు పక్కన పడిపోయాయి. పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాల ఆర్థిక పరిస్థితులు ప్రజల దుస్థితికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అధికారం కోసం ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.
శాంతి మార్గమే శ్రేయస్కరం
అధికారం, ఆధిపత్యం కోసం ఆక్రమణ లు చేయడం మంచిది కాదని పాలకులు గ్రహించాలి. ప్రతి దేశం మరో దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఐక్యరాజ్యసమితికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి. ఐక్యరాజ్యసమితిలో అవసరమైన మార్పులు చేయాలి. వీటో అధికారాన్ని భారత్, బ్రెజిల్, జర్మనీ వంటి దేశాలకు విస్తరించాలి. పర్యావరణ పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ప్రతి దేశం పాటించాలి.
ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా సమానమే అనే భావన పెరగాలి. సమస్యల పరిష్కారానికి యుద్ధం కాకుండా చర్చలే మార్గమని నమ్మాలి. యు ద్ధం ఎప్పుడూ వినాశనాన్నే మిగిలిస్తుంది. యుద్ధం ఎప్పుడూ నాశనాన్నే మిగులుస్తుం ది. రక్షణ వ్యయాన్ని తగ్గించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయాలి. ప్రజలందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి.
ప్రజాస్వామ్యం, సమా నత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలకు పాలకులు కట్టుబడి ఉండాలి. ఆధిపత్య ధోర ణి మానవాళికి ప్రమాదకరమని గుర్తించాలి. పారదర్శకమైన పరిపాలన ద్వారానే ప్రజల నమ్మకాన్ని పొందవచ్చు. సర్వే జనా సుఖినోభవంతు అనే భావనతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాలి. శాంతియుత సహజీవ నం ద్వారానే రేపటితరానికి మెరుగైన ప్రపంచాన్ని అందించగలం. ఆయుధాల నీడ నుంచి మానవాళికి విముక్తి లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
వ్యాసకర్త సెల్: 63056 82733




