1 April, 2026 | 2:58 AM

కేవోఎస్ ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే

01-04-2026 01:28 AM

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ప్రగతి నగర్‌లోని కేఓఎస్‌లో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే మంగళవారం వైభవంగా నిర్వహించారు. పోలీస్ ఆఫీసర్ సందీప్ కుమార్ తమ సందేశాన్ని అందిస్తూ పిల్లల మానసిక పరిపక్వత కొరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఒక పేరెంటుగా ఎంతో సంతోషంగా ఉందని తెలియ జేశారు. కేఓఎస్ డైరెక్టర్ తేజస్విని మాట్లాడుతూ..

ఈ ఆధునిక విద్యా విధానంలో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉంటేనే జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ మెడికల్ లో రాణించగలుగుతారని తెలియజేశారు. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ..

రెగ్యులర్ విద్యతోపాటు ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఇంటర్మీడియట్ ఎంసెట్ స్థాయి లెక్చరర్స్ తో చెప్పిస్తూ మానసికంగా దృఢంగా ఉం డేందుకు ఇంటర్నల్ కాంపిటీషన్స్, ఇంటర్నల్ గేమ్స్ శారీరక దృఢత్వం కొరకు స్పోర్ట్స్  ద్వారా ఇప్పించడం, టెక్నికల్ గా రాణించడం కొరకు రోబోటిక్స్, ఏఐ బేస్డ్ కాంపిటీ షన్స్, ఐఐటి బేస్డ్ ఒలంపియాడ్ ఎగ్జామ్స్, నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల చైర్‌పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజనీకాంత్, రాజా, ప్రిన్సిపల్స్ నటరాజ్, అకాడమీక్ కోఆర్డినేటర్స్, కోఆర్డినేటర్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.