1 April, 2026 | 2:57 AM

డబ్బుల కోసం సోషల్ మీడియాలో వేధింపులు

01-04-2026 01:26 AM

నిందితుడిని అరెస్టు చేసిన మార్కెట్ పోలీసులు

సికింద్రాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులు చేసి అదనపు డబ్బులు వసూలు చేస్తు న్న వ్యక్తిని మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కు చెందిన ముదిరాజ్ వన్నూరు స్వామి అలియాస్ అంజి కిరణ్ అలియాస్ అభి (34) ఉపాధి కోసం నగరానికి వచ్చి యూసఫ్గూడ రహమత్ నగర్‌లో నివాసముంటూ క్యాటరింగ్ కార్మికులను సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు.

సులువుగా డ బ్బులు సంపాదించాలనే ప్లాన్తో మొదట క్యాటరింగ్ సేవల పేరుతో అడ్వాన్స్ తీసుకుని, తర్వాత వివాదాలు సృష్టించి అదనపు డబ్బు లు డిమాండ్ చేయడం. బాధితుల వ్యక్తిగత వివరాలను ఉపయోగించి సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులు చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇదిలా ఉండగా  సికింద్రాబాద్ ప్రాం తానికి చెందిన ఓ వ్యక్తి జస్ట్ డయల్ ద్వారా క్యాటరింగ్ కార్మికులను బుక్ చేసుకున్నారు.

ముందుగా నిర్ణయించిన ధరలకు పని పూర్తి అయిన తర్వాత, నిందితుడు అదనపు డబ్బు లు డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారు నిరాకరించడంతో,ఫోన్ ద్వా రా అతడిని, కుటుంబ సభ్యులను దూషించడం ప్రారంభించాడు. నిందితుడు ఫిర్యాదు దారుని బంధువులకు కాల్స్ చేసి తప్పుడు సమాచారం పంపడం, ప్రమాదం జరిగినట్లు చెప్పడం వంటి చర్యలతో భయాందోళ నలు సృష్టించాడు.

ఒత్తిడి తో కొంత డబ్బు చెల్లించినప్పటికీ, వేధింపులు కొనసాగిస్తూ మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు మార్కెట్ పోలీసులను ఆశ్రయిం చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.