calender_icon.png 23 February, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే..

23-02-2026 01:57:53 AM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పుడు రెండో గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదలైంది. ఆదివారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో ఈ గీతావిష్కరణ వేడుక జరి గింది. పవర్‌స్టార్ ఆరాను ప్రతిబింబించేలా ఈ గీతముంది.

ఇందులో ‘నేను మెడ ము ట్టుకుంటే, తొడ కొట్టినట్టే..’ అనే లైన్ కేవలం పవర్‌ఫుల్‌గా వినిపించడమే కాదు.. అది పవర్ స్టార్ ఆరాలోని అసలైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. దేవిశ్రీప్రసాద్ తనదైన రీతి లో స్వరపర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీప్రసాద్; కూర్పు: కార్తిక శ్రీనివాస్; కళ: ఆనంద్‌సాయి; నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి; కథనం: కే దశరథ్, రమేశ్‌రెడ్డి; రచన, దర్శకత్వం: హరీశ్ శంకర్.