29 April, 2026 | 1:33 PM

అయ్యప్ప స్వాముల విరి అభివృద్ధికి సుంకిరెడ్డి సహకారం

27-04-2026 08:55 PM

- రేకుల షెడ్ నిర్మాణానికి రూ.92 వేల చెక్కు అందజేత

కల్వకుర్తి: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కైలాసగుట్టపై ధర్మశాస్త్ర భక్త బృందం నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వాముల విరి అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సి .ఓ .ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తనవంతు సహకారం అందించారు. భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్ నిర్మాణానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.92 వేల చెక్కును ధర్మశాస్త్ర భక్త బృంద సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజానికి మార్గదర్శకాలని, భక్తులకు సౌకర్యాలు కల్పించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

ప్రజలకు అవసరమైన చోట సేవ చేయడమే తన లక్ష్యమని, ఇలాంటి దైవ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తనవంతు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ధర్మశాస్త్ర భక్త బృంద సభ్యులు మాట్లాడుతూ రేకుల షెడ్ నిర్మాణానికి సహకారం అందించాలని కోరిన వెంటనే స్పందించి, ఇచ్చిన మాట ప్రకారం రూ.92 వేల ఆర్థిక సహాయం అందజేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మశాస్త్ర భక్త బృంద సభ్యులు శేఖర్ గౌడ్, మల్లేష్, శ్రీనివాసులు, చందు, రవి, రాజు, రవి సాగర్, హరీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.