15 April, 2026 | 9:37 AM

ఎమ్మార్పీకి హోల్‌సేల్ ధరకు అంత వ్యత్యాసం ఎందుకు?

24-11-2025 12:00 AM

రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ శ్రీధర్ , భానుప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్ భట్

మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 23: మందులపై ఎమ్మార్పీ ధరలకు హోల్సేల్ ధరలకు చాలా వ్యత్యాసం ఉందని ఇది ఎవరి లాభం కోసమని తెలంగాణ మెడికల్  అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్  రిసెప్షన్ కమిటీ ఫార్మేషన్ మీటింగ్ సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ శ్రీధర్ ,భాను ప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్ భట్ అన్నారు. జిల్లాలో మెడికల్ రిప్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించి ,మందుల కంపెనీలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని, కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని, పని గంటలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారన్నారు. 

పని భారం విపరీతంగా పెరిగి మానసిక శోభకు గురవుతున్నారని, కార్పొరేట్ శక్తులు మతోన్మాద శక్తులు కలిసి దేశ పాలకులుగా కొనసాగుతున్నారని తెలిపారు. వారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 26 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేటు యాజమాన్య అనుకూల విధానాలను అమలు చేస్తూ కార్మికుల సమ్మెకు పోరాటహక్కులను నిరసన తెలిపే హక్కులను హరిస్తూ శ్రమ దోపిడి ఇంకా పెంచడానికి  కార్పొరేట్ శక్తులు కార్మికులను దోచుకోవడానికి నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చారన్నారు.

దేశవ్యాప్తంగా 26వ తేదీ జరిగే ఆందోళన పోరాటాల్లో మెడికల్ రిప్సు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శోభన్ యాదవ్, రాఘవేందర్, భాను, ప్రకాష్ రమణా రెడ్డి, అమరేందర్, మాధవ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.