అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం
బెజ్జూర్ జూలై 31 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని రేచీని గ్రామంలో తల్లి,తండ్రి కోల్పోయిన అనాధ పిల్లలకు మండల విద్యాధికారి డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. తల్లి తండ్రి కోల్పోయి అనాధలుగా మారిన నిరుపేద చిన్నారులకు మండల విద్యాధికారి డాక్టర్ సునీత, ఉపాధ్యాయులు అందరూ మమేకమై చిన్నారులకు 12,300 నగదును గ్రామ ప్రజల సమక్షంలో వారికి అందజేశారు.
చిన్నారులు బడికి వెళ్లేలా గ్రామ ప్రజలు చూడాలని చదువుకుంటేనే చిన్నారులకు సంస్కారం లభిస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని వారు జ్ఞానవంతులు కావాలంటే చదువు తప్పనిసరిగా అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సింధుజ, సాయి చరణ్, దిలీప్ కుమార్, సిఆర్పి సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం బెజ్జూర్ అంగన్వాడి సూపర్వైజర్ అలేఖ్య ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు అంగన్వాడీ టీచర్లు 10000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.






