31 May, 2026 | 9:36 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

06-04-2026 12:00 AM

చారకొండ, ఏప్రిల్ 5: మండల కేంద్రానికి చెందిన మునగాల లోకేశ్వర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మరణించగా.. ఆయన కుటుంబానికి పాఠశాల మిత్రులు అండగా నిలిచారు. చారకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లోకేశ్వర్తో కలిసి చదువుకున్న 1997-98 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు.

ఆదివారం లోకేశ్వర్ దశదిన కర్మ సందర్భంగా మిత్రులంతా కలిసి సమీకరించిన రూ. 56,500 నగదును బాధిత కుటుంబానికి (భార్య, కుమారులకు) అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న లోకేశ్వర్ కుటుంబానికి భరోసా కల్పించేందుకే ఈ చిరు సాయం చేశామని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.