13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆటలలోనే కాదు... ఆపదలో కూడా అండగా ఉంటాం

31-03-2026 06:31 PM

* స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆటలు ఆడుకున్నాం కలిసి చదువుకున్నాం ఆటలే కాదు కష్టంలో కూడా స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటాం అని నిరూపించారు తోటి స్నేహితులు గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన తోటి స్నేహితుడు పిట్ట శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. స్నేహితుడు కుటుంబం బీద స్థితిలో ఉండటంతో ఆపదలో ఉన్న వారి కుటుంబానికి నాటి స్నేహితులు కొందరు అండగా నిలిచారు.

తనతో 1998 - 99 మండల కేంద్రమైన గరిడేపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బ్యాచ్ కి చెందిన స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితులు 24 వేల రూపాయలు మృతి చెందిన స్నేహితుడు భార్యకు మంగళవారం అందజేశారు.మృతి చెందిన స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.ఆర్థిక సాయం అందజేసిన వారిలో  టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు కీసరి నాగయ్య,మాచర్ల వెంకటేశ్వర్లు, కానుగు సోమయ్య,పెండెం పెద్ద రాంబాబు,కర్నాటి కవిత, కుక్కునూరు సుజాత తదితరులు ఉన్నారు