05-07-2025 07:34:52 PM
చిట్యాల,(విజయక్రాంతి): మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల పోషాలు ఇటీవల మృతి చెందారు. కాగా మృతుడి కుమారుడు కంచర్ల రాంబాబు 10వ తరగతి 2006 విద్యా సంవత్సరానికి చెందిన మిత్రులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిత్రులందరికీ కలిసి జమ చేసిన రూ.23వేల నగదును మృతుని దశదినకర్మ రోజు శనివారం కుటుంబ సభ్యులకు అందజేసి ఆసరాగా నిలిచారు.