05-07-2025 07:33:05 PM
భయాందోళనలో జనం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాలనీలోని భూక భాష ఇంట్లో ఆయన సతీమణి రక్మ ఉదయం 10.30 గంటలకు టీవీ చూస్తున్న సమయంలో, ఒక అపరిచిత వ్యక్తి(దొంగ) అకస్మాత్తుగా ఇంట్లో ప్రవేశించి, ఆమె పీక పట్టుకుని నొక్కుతూ ఒంటీ మీద ఉన్న ఆరు తులాల బంగారపు వస్తువులను అపహరించాడు.
ఆమె అరుపులు ఇతరులకు వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టి బెదిరించి బంగారం తీసుకొని దర్జాగా వెళ్ళిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న వారు సమీపంలోని సీసీ కెమెరాలును పరిశీలించారు. వచ్చిన వ్యక్తి పసుపు రంగు షర్టు నల్ల పాయింట్ ధరించి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని గమనించారు. త్వరలో దొంగని పట్టుకుంటామని వారికి హామీ ఇచ్చారు. పట్టపగలే చోరీ జరగడంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు