05-07-2025 07:36:43 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు స్థానిక సంస్థల అదరపు కలెక్టర్ వైజాగ్ అన్నారు. శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర మంత్రి సీతక్కతో పచ్చదనం పరిశుభ్రత సీజనల్ వ్యాధులు హరితహారంలో మొక్కల పెంపకం అయితే అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేసినట్టు తెలిపారు. జిల్లాలో పారిశుధ్య పనులను ప్రతిరోజు నిర్వహించాలని వ్యాధులు రాకుండా ఆరోగ్యశాఖ శాఖ ప్రమాదంగా ఉండాలని హరితహారం లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాస్ జెడ్పి సీఈవో గోవిందు డి ఆర్ డి ఓ నాగ వర్ధన్ అధికారులు పాల్గొన్నారు