20 March, 2026 | 2:12 AM

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

20-03-2026 12:39 AM

ములుగు, మార్చి19 (విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సుడిబాక గ్రామంలో  మడప భాస్కర్ కు తన పొలం దగ్గరికి వెళ్లుతున్న సమయంలో వేటగాళ్లు అడవి పందుల కోసం అమర్చిన కరెంటు తీగకు తగిలి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అతనికి రోజుకి లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడడం,

నిరుపేద కూలి కుటుంబానికి చెందిన ఆయనకు అమ్మ ఫౌండేషన్ ద్వారా 30వేల రూపాయలు వైద్య సహాయం కోసం అందించారు.  ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, చైర్మన్ డాక్టర్ పీర్ల కృష్ణబాబు, ఫౌండేషన్ సభ్యులు పీ.స్వరూప రాణి, మౌనిక, బట్టి విజయ్ కుమార్, జాడి నవీన్ పాల్గొన్నారు.