20 March, 2026 | 8:08 AM

కేటీఆర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రవిచంద్ర

20-03-2026 12:40 AM

వరంగల్, మార్చి 19 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.