పాఠశాలల ఆర్థిక ఆడిట్ పూర్తి
23-07-2026 12:00 AM
ఎర్రవల్లి, జూలై 22: ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా లు, గురుకుల పాఠశాలలకు సంబంధించిన 202526 ఆర్థిక సంవత్సరపు ఇంటర్నల్, స్టాట్యుటరీ ఆడిట్ను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి ఆడిట్ బృందానికి చెందిన వెంకటేష్, ఫయాజ్ పా ఠశాలల ఆర్థిక లావాదేవీలు, ఖాతా పుస్తకా లు, రికార్డులు, వోచర్లు తదితర పత్రాలను ప రిశీలించి ఆర్థిక నిర్వహణపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవోలు అమీర్ పాషా, వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.






