ముసురు వర్షానికి కూలిన మట్టి ఇండ్లు
23-07-2026 12:00 AM
అయిజ, జూలై 22: గత మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు అయిజ మండలంలోని తూముకుంట గ్రామంలో రెండు మట్టి ఇళ్లు కూలిపోయాయి. ఎర్రన్న, శాంతిరాజు కుటుంబాలకు చెందిన ఇళ్లు బుధవారం రాత్రి కూలిపోగా, ఆ సమయంలో కుటుంబ సభ్యులు బయట ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో నివసించేందుకు ప్రత్యామ్నాయ వసతి కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.






