calender_icon.png 20 January, 2026 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

20-01-2026 07:00:17 PM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి మున్సిపల్ శాఖ కార్యదర్శి టి కె శ్రీదేవి తో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు-కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికలలో వినియోగించే సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ ప్రింటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు, పి ఓ, ఓ పి ఓ లకు శిక్షణ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, సామాగ్రి పంపిణీ కేంద్రం, స్వీకరణ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన బడ్జెట్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి- కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో 20 వార్డులకు గాను 28 పోలింగ్ కేంద్రాలు, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు గాను 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పి ఓ లు, ఓ పి ఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, స్వీకరణ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్లు గజానన్, రాజేందర్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు