23 March, 2026 | 7:16 PM

పెండ్లి రుణాలకు ఫిన్‌టెక్‌

16-11-2024 02:40 AM

 ప్రారంభించిన మాట్రిమోనీ

చెన్నై, నవంబర్ 15: పెండ్లిళ్లకు రుణాలివ్వడానికి ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ weddingloans.comను మ్యాచ్‌మేకింగ్ సర్వీసుల్ని అందించే మాట్రిమోనీ కామ్ ప్రారంభించింది. ఇందుకోసం ఐడీఎఫ్‌సీ, టాటా క్యాపిటల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ తదితర ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మ్యాట్రిమోనీ కామ్ తెలిపింది. ఈ పెండ్లి రుణాల్ని అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్‌గా ఒకే మొత్తంగా జంటకు అందిస్తామని, ఆ రుణాన్ని నిర్ణీతకాలంలో స్థిరవాయిదాలుగా చెల్లించాలని కంపెనీ తెలిపింది.