మొక్కలు నాటిన ఎంపీడీవో
15-07-2026 02:37 PM
ఇచ్చోడ, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని దళిత స్మశాన వాటికలో MPDO నరేష్ బుధ వారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు పెంచడం వల్ల వర్షాలు కురుస్తాయని, ప్రతి ఇంటికి రెండు చెట్లు పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో EO సురేష్, వార్డు సభ్యులు కొల్లూరి చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచ్ ఏనుగు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, దళిత సంఘం నాయకులు కొల్లూరి సంతోష్, కొత్తూరు లక్ష్మణ్, అన్నెల లక్ష్మణ్, జిల్ల నరసయ్య, దుబ్బాక చందు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






