15 July, 2026 | 2:40 PM

లక్ట్రికల్ వర్కర్స్ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

15-07-2026 02:40 PM

ముకరంపుర, జూలై 15(విజయ క్రాంతి): కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్,  యాదగిరి సునీల్ రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సంఘ భవన నిర్మాణం కోసం తగిన స్థలం కేటాయించాలని వారు కోరారు.ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు  మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో, కరీంనగర్ లోని అన్ని కార్మిక సంఘాల సౌకర్యార్థం నూతనంగా 'కార్మిక భవన్' ను నిర్మించనున్నట్లు తెలిపారు.  ఈ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పించే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. అలాగే భవన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత వహించి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ దువ్వాసి రాజబాబు,  తదితరులు పాల్గొన్నారు.