calender_icon.png 15 January, 2026 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్ల షోరూంలో అగ్నిప్రమాదం

15-01-2026 02:36:34 AM

మేడ్చల్, జనవరి 14 (విజయక్రాంతి): అల్వాల్ లోని ట్రూ వేల్యూ కార్ల షోరూంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో మొత్తం దట్టమైన పగలు వ్యాపించాయి. పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. కార్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.