15-01-2026 02:34:21 AM
కరీంనగర్ క్రైం, జనవరి 14 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెడుతూ యువకులను ఆకర్షించి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న భార్యాభర్తలను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు రెండేళ్లుగా కరీంనగర్ రూరల్ మండలం ఆరేపల్లిలో గల శ్రీ సాయి నివాస అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో భార్యాభర్తలు ఇన్‌స్టాగ్రామ్ లో తమ ఫొటోలను పెడుతూ యువకులకు వలపు వల విసిరేవారు. ఆకర్షితులైన యువకులతో తన భర్త అనుమతితో ఏకాంతంగా గడుపుతూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఆ తర్వాత వారిని నగ్నంగా ఉన్న వీడియోలు మా వద్ద ఉన్నా యి..
వాటిని వైరల్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు. సంవత్సరం కింద పరిచయమైన కరీంనగర్‌కు చెందిన వ్యక్తిని కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే నీ వీడియోలు మీ ఇంట్లో వారికి పంపుతామని బెదిరించారు. సదరు వ్యక్తి భయపడి తన వద్ద ఒక లక్ష రూపాయలు ఇచ్చి మిగతా నాలుగు లక్షలు రెండు రోజుల్లో పంపిస్తామని, ఇంతవరకు దాదాపు మీకు 14 లక్షల రూపాయల వరకు ఇచాడు. అయినా వారు వినకపోగా వీడియోలు బయటపెట్టి నిన్ను ఏదో విధంగా చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం భార్యాభర్తలపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, వీడియోలు తీసిన మొబై ల్ ఫోన్లను, చెక్కును స్వాధీనం చేసుకున్నా రు. కేసును 24 గంటల లోపు ఛేదించి పట్టుకున్నందుకు కరీంనగర్ రూరల్ సిబ్బందిని ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.