15-01-2026 02:40:21 AM
రాజేంద్రనగర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన
రాజేంద్రనగర్, జనవరి 14 (విజయక్రాంతి) : ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాతించాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా బుధవారం రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డిపో మేనేజర్ కూడా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ జీరో-యాక్సిడెంట్ రికార్డ్ కలిగిన డ్రైవర్లకు అధికారిక ‘ప్రొఫెషనల్ డ్రైవర్‘ అనే ప్రశం సా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో50 మంది డ్రైవ ర్లు పాల్గొని రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు.