అప్రమత్తంగా ఉండాలి
నాగిరెడ్డిపేట్, మే 3 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని జువెలరీ షాపులో ఆదివారం దొంగలు దొంగతనం చేసి పరారీ. అయినవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ సోమవారం తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని ఒక జ్యువెలరీ షాపులో ఆదివారం ఐదు మంది దొంగలు పిస్తల్తో కాల్పులు జరిపి దొంగతనం చేసి పరారైన నేపథ్యంలో నాగిరెడ్డిపేట మండలంలోని సరిహద్దు గ్రామమైనటువంటి పోచారం గ్రామంలో దొంగలు మన ప్రాంతం వైపు వచ్చే అవకాశం ఉందని భావించి నాగిరెడ్డిపేట్ పోలీస్ సిబ్బంది ఆయుధాలతో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ భార్గవ గౌడ్ మాట్లాడుతూ... మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో ఎవరైనా కొత్తగా వ్యక్తులు కనిపించినట్లయితే సమాచారం అందించాలన్నారు. ఎవరు భయాందోళనకు గురి కావద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






